మౌనం వీడండి! | Sakshi
Sakshi News home page

మౌనం వీడండి!

Published Mon, May 2 2016 2:45 AM

మౌనం వీడండి!

 ప్రధానికి కరుణ సూచన
 కొనసాగుతున్న దాడులు
 తనిఖీలు ముమ్మరం

 
 సాక్షి, చెన్నై: తమిళనాట ఎన్నికల్లో  అధికార పక్షం అవినీతి సొమ్ము బయట ప డుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. ఇప్పటి కైనా మౌనం వీడి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నగదు బట్వాడా లక్ష్యం గా ఈసీ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల మేరకు నగదు పట్టుబడుతున్నా, ఇంత వరకు కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పవచ్చు. ఇవన్నీ అన్నాడీఎంకే వర్గాలకు చెందిన సొమ్ముగా మీడియాల్లో కథనా లు వెలువడుతూ వస్తున్నాయి. ఆదివా రం కూడా పెద్ద ఎత్తున నగదు, తాయిలాలు పట్టుబడ్డాయి.
 
  మదురైలో రెండాకుల చిహ్నంతో కూడిన 60 ఫ్రిడ్జ్‌లు, నాట్రాంపల్లిలో రెండాకుల చిహ్నంతో కూడి రూ. కోటి 11 లక్షలు విలువగల వస్త్రాలు, కడలూరులో మంత్రి సంపత్ ఇంటికి సమీపంలో మినీలారీలో ఉన్న వస్తువులు, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఇలాక బోడి నాయకనూరులో రెండు లారీల్లో తీసుకొచ్చిన చీరలు, టో పీలను, పందలూరులో ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, రాశిపురంలో అన్నాడీఎంకేకు చెందిన నాయకుడి పరిశ్రమ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అ యితే, ఇంతవరకు పట్టుబడ్డ నగదు, వస్తువులు, వస్త్రాలు ఎవరివో అన్న వివరాలు మాత్రం బయటకు రావడం లే దు. కేసులు కూడా నమోదు కాలేదని చె ప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే అంశాల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినే త  ఎం కరుణానిధి ఎన్నికల యంత్రాం గానికి ప్రశ్నల్ని సంధించారు.
 
 కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రజ ల తరఫున నిలదీస్తూ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే సర్కారు ఐదేళ్లల్లో సాగించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. పట్టుబడుతున్న నగదు, తాయిలాలు అన్నీ ఆ పార్టీ వారికి చెందినవిగా సంకేతాలు వ స్తున్నాయని, అయితే, ఇంత వరకు వివరాలు ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. తమిళనాట సాగిన అవినీతి అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచి స్తూ, తాజాగా సాగుతున్న వ్యవహారాల పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌ నంగా ఉన్నారో అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కల్పించుకోవద్దని హితవు పలికారు.
 

Advertisement
 
Advertisement