
ఫైనల్ మ్యాచ్ ను ఎంజాయ్ చేసిన మాల్యా!
భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ... ప్రస్తుతం లండన్ లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ను ఉత్కంఠగా వీక్షించారు.
లండన్:భారత్‌లో రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ... ప్రస్తుతం లండన్ లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ను ఉత్కంఠగా వీక్షించారు. ఐపీఎల్లో ఆర్సీబీ యజమాని అయిన మాల్యా, పలువురు ప్రముఖులతో కలిసి తుది పోరును ఆసక్తిగా తిలకించారు.
ఐపీఎల్ తుది పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో తమ ఐపీఎల్ మ్యాచ్ లను నేరుగా వీక్షించిన విజయా మాల్యా అండ్ కంపెనీ, ఈసారి మాత్రం టీవీలో మ్యాచ్ ను చూడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్ధ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.