సానియా టాప్ ర్యాంక్ యథాతథం
గతవారం పోర్షె ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడినా... ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా టాప్ ర్యాంక్ పదిలంగా ఉంది. తాజా ర్యాంకింగ్స్‌లో సానియా 7,660 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో, సారా ఎరాని (ఇటలీ) 7,360 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.