డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంది!

డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంది!


వాషింగ్టన్:ఇటీవల ట్విట్టర్ వేదికగా డేటింగ్ బెట్టింగ్ వేసి ఓటమి పాలైన కెనడా టెన్నిస్ స్టార్ ఎగునీ బౌచర్డ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. తాను వేసిన బెట్టింగ్ ప్రకారం 20 ఏళ్ల  విద్యార్థి జాన్ గోహ్రెక్ తో కలిసి డేటింగ్ వెళ్లినట్లు బౌచర్డ్ తాజాగా స్పష్టం చేసింది.' నా మాట ప్రకారం అతనితో డేటింగ్ కు వెళ్లా. దానిలో భాగంగా ముందుగా అతనితో కలిసి మిల్ వాకీ-ఎన్బీఏ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ కు  హాజరయ్యా. ఆ తరువాత డేటింగ్ కోసం  కొన్ని స్విమ్ సూట్లు పరిశీలించా 'అని బౌచర్డ్ తెలిపింది. ఈ మేరకు జాన్ గోహ్రెక్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది.





గత నెల్లో సూపర్ బౌల్ ఈవెంట్ లో భాగంగా అమెరికా ఫుట్బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌచర్డ్ బెట్టింగ్  కు పాల్పడి ఓటమి పాలైంది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ వెంటనే అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా  బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని ఆ తరువాత బౌచర్డ్ తలపట్టుకుంది.  ఫిబ్రవరి 25 వ తేదీన 23 ఒడిలోకి అడుగుపెడుతున్న బౌచర్డ్.. తాను జీవితంలో చేసిన పొరపాట్లలో ఇదొక పెద్ద తప్పిదంగా పేర్కొంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top