రెండో వికెట్ కు 50 బంతుల్లో 50 పరుగులు
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోవడంతో ఆచితూచి ఆడుతోంది. హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ జాగ్రత్తగా ఆడుతున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 50 బంతుల్లో 50 పరుగులు జోడించారు.
దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 70/1 స్కోరు చేసింది. హషిమ్ ఆమ్లా(37), డుప్లెసిస్(25) క్రీజ్ లో ఉన్నారు.