
చంద్రబాబు ఏం సాధించారు: వీహెచ్
ఎన్‌డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ఎన్‌డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు రైళ్లు మినహా ... తెలుగు ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా పుట్టిన నవ్యాంధ్రప్రదేశ్‌కు కూడా సదానంద బడ్జెట్ నిరాశను మిగిల్చిందని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో రైల్వే ప్రైవేటీకరణే లక్ష్యంగా మోడీ సర్కార్ రైల్వే బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. సదానందగౌడ్ రైల్వే లెక్కలు... ఇరు రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపించాయని మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు ఎలాంటి ప్రయోజనాలు రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.