సూర్య అండ్‌ విజయ్‌తో...

సూర్య అండ్‌ విజయ్‌తో... - Sakshi


‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్‌ దిగిందా? లేదా?’ – ‘పోకిరి’లో మహేశ్‌బాబు డైలాగ్‌ ఇది. ఇప్పుడు కోలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ స్పీడు గురించి చెప్పాలంటే ఈ డైలాగే కరెక్ట్‌ ఏమో! తమిళ స్టార్‌ హీరోలు ఒక్కొక్కరితో వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడెప్పుడో కెరీర్‌ స్టార్టింగ్‌లో ఒకటీ అరా తమిళ సినిమాలు చేసిన రకుల్‌ రీసెంట్‌గా కోలీవుడ్‌పై మళ్లీ కన్నేశారు. అందులో ఫస్ట్‌ స్టెప్‌... ‘స్పైడర్‌’. మహేశ్‌బాబు హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న బైలింగ్వల్‌తో తమిళ తెరకు గ్రాండ్‌ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘స్పైడర్‌’ తర్వాత లైనప్‌ కూడా స్ట్రాంగ్‌గా ఉంది.



ప్రస్తుతం కార్తీతో ‘ధీరమ్‌ అధికారమ్‌ ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) చేస్తున్న రకుల్‌... త్వరలో కార్తీ అన్నయ్య సూర్యతో జత కడుతున్నారు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న సినిమాలో రకులే హీరోయిన్‌! దీంతోపాటు విజయ్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాకూ రకుల్‌ సంతకం చేయనున్నారట! ‘స్పైడర్‌’ షూటింగ్‌లో రకుల్‌ యాక్టింగ్, ప్రొఫెషనలిజమ్‌ నచ్చిన మురుగదాస్, ఆయన తర్వాతి సిన్మాలోనూ రకుల్‌నే హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. అయితే... విజయ్‌–మురుగదాస్‌ సిన్మా షెడ్యూల్‌ ఒకటి, ప్రస్తుతం రకుల్‌ చేస్తున్న హిందీ సిన్మా ‘అయ్యారీ’ షెడ్యూల్‌ క్లాష్‌ అవుతున్నాయట! సో, క్లాష్‌ రాకుండా డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడానికి రకుల్‌ ప్రయత్నిస్తున్నారట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top