పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్ | Pawan Kalyan Slim Look in trivikram film | Sakshi
Sakshi News home page

పవన్ లుక్కు సూపర్ రెస్పాన్స్

Jun 21 2017 10:36 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ను సారథి స్టూడియోస్లో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ సందర్భంగా లీక్ అయిన పవన్ స్టిల్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. సర్థార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపించిన పవన్ లుక్పై విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ సినిమాలో మరోసారి యూత్ ఫుల్ లుక్లో కనిపించేందుకు పవన్ స్లిమ్ లుక్లో మారిపోయాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్లు పవన్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement