ఎలిఫెంట్ మ్యాన్: వైద్య శాస్త్రానికి ఓ సవాల్!

ఎలిఫెంట్ మ్యాన్: వైద్య శాస్త్రానికి ఓ సవాల్! - Sakshi


బీజింగ్: వైద్య శాస్త్రానికి అతడు ఓ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలాడు. ఎలిఫెంట్ మ్యాన్ గా చైనా అంతటా ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన పేరు హువాంగ్ చుంకాయ్(39). అత్యంత అరుదైన న్యూరోఫిబ్రోమాటోసిస్ సిండ్రోమ్ తో గత 35 ఏళ్లుగా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నాడు. హువాంగ్ కు నాలుగేళ్లున్నప్పుడు ఈ సమస్య మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా దీనిని అరుదైన వ్యాధిగా గుర్తించారు. దీని వల్ల చర్మం ఉబ్బడం, చర్మం సాగడం జరుగుతుంది. ఇతడి ఆరోగ్య సమస్యలపై కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని డాక్యుమెంటరీలు కూడా చేశారు.



ఈ వ్యాధిని నయం చేసేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెల్ కాలేకపోతున్నారు. ఇప్పటివరకూ నాలుగు మేజర్ సర్జరీలు జరిగినా ప్రయోజనం కనిపించలేదట. విరాళాలు సేకరించి 2007లో తొలిసారిగా సాగిన చర్మాన్ని తొలగించుకునే యత్నం చేశాడు. ఆపై మరో మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇందుకు చికిత్స ఏంటన్నది వైద్య చరిత్రలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ముఖానికి సంబంధించిన అరుదైన వ్యాధితో సతమతమవుతున్న హువాంగ్ చాలా అరుదుగా జనాల మధ్యకి వస్తాడు. తమ సినిమాలలో భయంకరమైన రాక్షసుడిగా చూపిస్తామని సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు తనను కలవగా వారి ఆఫర్లను రిజెక్ట్ చేశాడు.





తన వింత ఆకారాన్ని చూసి తోటి విద్యార్థులు భయాందోళనకు గురువుతున్నారని చదువు మధ్యలోనే మానేసిన తనకు ఇలాంటివి ఇష్టం లేదన్నాడు. ఆపరేషన్ చేసి పెరుగుతున్న చర్మాన్ని తొలగిస్తున్న మళ్లీ పెరిగిపోవడంతో పూర్వ ముఖ రూపం వస్తుంది. హువాంగ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉంటున్నాడు. తన వ్యాధికి చికిత్స ఉండకపోతుందా.. ఏదైనా ఓరోజు పూర్వ అందరిలా మామూలు మనిషి అవుతానని ధీమా ఆయనలో ఉంది.



న్యూరోఫిబ్రోమాటోసిస్ లక్షణాలేంటి?

న్యూరోఫిబ్రోమాటోసిస్ అంటే ఓ జన్యుసంబంధమైన విచిత్ర పరిస్థితి. మానవ శరీరం నుంచి ఏదైనా భాగం నుంచి ఎముకలు, చర్మంలో పెరుగుదల కన్పించడమే ఈ వ్యాధి లక్షణం. కొన్ని సందర్భాలలో తలలోని కణాలు, ఎముకలు పెరుగుతాయి.  తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇందుకు బీజం పడుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. న్యూరోఫిబ్రోమాటోసిస్ టైప్ వన్(ఎన్ఎఫ్ 1), ప్రోటిస్ సిండ్రోమ్ సమస్యల కారణంగా హువాంగ్ ముఖం అలా వికృతంగా తయారయి ఉండొచ్చునని 2001లో అతడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు.



Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top