మా నమ్మకాన్ని నిలబెట్టాడు

మా నమ్మకాన్ని నిలబెట్టాడు


సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ బిడ్డకు వరల్డ్ కప్‌లో ఆడేందుకు అవకాశం రావడంతో సంతోషంలో మునిగి తేలుతున్న సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులు ‘సాక్షి’తో పంచుకున్న మనోభావాలివి.



రాయుడు తొలి కప్ ఎప్పడు అందుకున్నాడు?



తొమ్మిదో ఏటే తొలి కప్ అందుకున్నాడు. ఆ తరువాత తను సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. ఆటపై ఎంత ఆసక్తి చూపినా చదువును మాత్రం వదిలిపెట్టలేదు. స్కూల్లో కూడా ఫస్టే. ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేశాడు. మా కోడలు విద్య ఎమ్‌బీఏ చేసింది.



మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని ఎలా తెలిసింది?



నేను టీవీలో న్యూస్ చూస్తున్నాను. టీం ఇండియాకి ఎంపికైన వారి జాబితాను చెబుతున్నారు. అందులో మా వాడి పేరు చెప్పగానే ఒక్కసారిగా ఆనందంతో ఎగిరి గంతేశా. చాలా రోజుల తర్వాత  మా కుటుంబమంతా కన్న కల  నిజమైంది. మా నమ్మకాన్ని నిలబెట్టాడు.  



భారత జట్టులో స్థానం కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చినప్పుడు మీ అబ్బాయిని ఎలా సముదాయించేవారు?



 మా అబ్బాయి ఎప్పుడూ అవకాశం కోసం ఎదురు చూడటం ఆపలేదు. అలాగని ఏ రోజూ డీలా పడి కూర్చోలేదు. పెళ్లయ్యాక మాతో పాటు మా కోడలు వాడికి ఆసరా అయింది.

 

క్రికెట్ కాకుండా మీ అబ్బాయికి ఇష్టమైనవేంటి?

 

‘సినిమాలంటే బాగా ఇష్టపడతాడు. ఈ మధ్య పొలాలు, వ్యవసాయం అంటూ మాట్లాడుతున్నాడు. మా వాడి ఆసక్తి అటువైపు మళ్లిందేమో! వాళ్ల అమ్మ చేసే వంటల్లో నాన్‌వె జ్‌ను బాగా ఇష్టపడతాడు.  



విజయలక్ష్మి గారూ! రాయుడిని క్రికెటర్‌గా చూడాలని మీవారి ఆశ. మరి తల్లిగా మీ బిడ్డ ఏం కావాలని మీరు కోరుకున్నారు?

 

ప్రత్యేకించి ఏ విధమైన ఆలోచన ల్లేవు. ఆ తండ్రీ కొడుకుల కల నెరవేరాలని కోరుకునేదాన్ని. నేను, మా వారు, మా అమ్మాయి వాణ్ని ఎందులోనూ కాదని చెప్పం. ఎందుకంటే తను ఏదైనా సాధించగలడన్న విశ్వాసం మాకు ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top