రూరల్ డెవలప్‌మెంట్ కోర్సు వివరాలు


 రూరల్ డెవలప్‌మెంట్ కోర్సు అందిస్తున్న సంస్థల వివరాలు, ఉపాధి అవకాశాల గురించి వివరించండి?    -రవి, ఆదిలాబాద్

 కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:

 అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: డిగ్రీ

 వెబ్‌సైట్: www.gbpssi.nic.in

 గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్(ఐఆర్‌ఎంఏ).. రూరల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది.

 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ

 వెబ్‌సైట్: www.irma.ac.in

 జార్ఖండ్‌లోని రాంచీలో జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: డిగ్రీ.

 ప్రవేశం: ఎక్స్‌ఏటి పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

 వెబ్‌సైట్: www.xiss.ac.in

 పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయం.. రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటెగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.

 అర్హత: బయలాజికల్/సోషల్ సైన్స్/అనుబంధ సబ్జెక్టుల్లో బీఎస్సీ(ఆనర్స్)

 వెబ్‌సైట్: www.rkmvu.ac.in

 దూరవిద్య ద్వారా ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:

 ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. రూరల్ డెవలప్‌మెంట్‌లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సులను అందిస్తోంది. అర్హత: డిగ్రీ

 వెబ్‌సైట్:www.ignou.ac.in

 అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: డిగ్రీ

 వెబ్‌సైట్: www.skuniversity.org

 వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్.. రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. అర్హత: డిగ్రీ

 వెబ్‌సైట్: www.kuwarangal.com

 ఉపాధి అవకాశాలు: కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ సంస్థలతో పాటు ఎన్‌జీవో, బిజినెస్ సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

 

 ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు అందిస్తున్న సంస్థలు, వాటి ప్రవేశ విధానం, అర్హతల గురించి తెలపండి?

 -శ్వేత, నిర్మల్

 ఆర్థిక గణాంకాలను అధ్యయనం చేయటం ఎకనోమెట్రిక్స్‌లో ఒక భాగం. ఇది ఎకానమీ, స్టాటిస్టిక్స్‌ల మేళవింపుగా ఉంటుంది. ఎంఏ ఎకనామిక్స్‌లో ఎకనోమెట్రిక్స్ భాగంగా ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందిస్తున్నాయి.

 తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.

 అర్హత: డిగ్రీ

 ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.

 బ్‌సైట్: www.svuniversity.ac.in

 తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.

 అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ.

 ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.

 వెబ్‌సైట్: www.srmuniv.ac.in

 తమిళనాడులోని భారతియార్ విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.

 అర్హత: మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ ఎకనోమెట్రిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ.

 వెబ్‌సైట్: www.b-u.ac.in

 

 బీడీఎస్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు, ఉన్నత విద్యావకాశాల గురించి వివరించండి?

 -ప్రవీణ్, సుల్తాన్‌పూర్

 బీడీఎస్ కోర్సును అందిస్తున్న కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు:

 హైదరాబాద్‌లోని పనినీయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్ అండ్ రిసెర్చ్ సెంటర్.. బీడీఎస్ కోర్సును అందిస్తోంది.

 అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, జువాలజీ). ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు ఉండాలి.

 ప్రవేశం: ఎంసెట్ ర్యాంకు, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా.

 వెబ్‌సైట్: www.pmids.org

 హైదరాబాద్‌లోని శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ బీడీఎస్ కోర్సును అందిస్తోంది.

 అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ)

 ప్రవేశం: ఇంటర్ మార్కులు, ఎంసెట్‌లో ప్రతిభ ఆధారంగా.    వెబ్‌సైట్: www.sscds.edu.in/

 బీడీఎస్ తర్వాత ఎక్కువ మంది ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎంచుకుంటున్నారు. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:

 హైదరాబాద్‌లోని దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని హాస్పిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. రెండున్నరేళ్ల (ఇంటర్న్ షిప్‌తో కలపి) మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సును అందిస్తోంది. దీనితో పాటు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.

 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ

 ప్రవేశం: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా.

 వెబ్‌సైట్: www.osmania.ac.in/

 www.apolloiha.ac.in

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top