ఇండియన్ నేవీ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్..


ఇండియన్ నేవీ... యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్) కింద కమిషన్డ్ ఆఫీసర్లుగా అడుగుపెట్టేందుకు చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

 

అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత అభ్యర్థులు అర్హులు. బీఈ/బీటెక్ ప్రి ఫైనలియర్ వరకు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

 

 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ):

     పైలట్: బీఈ/బీటెక్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). పురుషులు మాత్రమే అర్హులు.

     అబ్జర్వర్: బీఈ/బీటెక్ (10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). పురుషులు మాత్రమే అర్హులు.

     ఐటీ: బీఈ/బీటెక్ (ఐటీ/సీఎస్‌ఈ/కంప్యూటర్ ఇంజనీరింగ్). పురుషులు మాత్రమే అర్హులు.

 పర్మినెంట్ కమిషన్, షార్ట్‌సర్వీస్ కమిషన్:

 

 టెక్నికల్ బ్రాంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్:

ఇంజనీరింగ్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (మెకానికల్/ మెరైన్/ఆటోమొబైల్/మెకట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్/మెటలర్జీ/ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.



ఎలక్ట్రికల్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్/పవర్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఏవియానిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.



నేవల్ ఆర్కిటెక్చర్ (ఎన్‌ఏ): మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/ఏరోస్పేస్/మెటలర్జీ/నేవల్ ఆర్కిటెక్చర్. పురుషులు, మహిళలు అర్హులు.

 

 సబ్‌మెరైన్ టెక్నికల్ షార్ట్ సర్వీస్ కమిషన్:

ఇంజనీరింగ్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (మెకానికల్/మెరైన్/ఆటోమొబైల్/మెకట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్/మెటలర్జీ/ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్/ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. పురుషులు మాత్రమే అర్హులు.



ఎలక్ట్రికల్ బ్రాంచ్: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కంట్రోల్/టెలికమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/పవర్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. పురుషులు మాత్రమే అర్హులు.



వయసు: 2016, జూలై 1 నాటికి 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, అవసరమైన శారీరక ప్రమాణాలుండాలి.



వేతన స్కేలు: సబ్ లెఫ్టినెంట్ నుంచి కమాండర్ స్థాయికి ఎదిగే క్రమంలో సర్వీస్ ప్రకారం వేతనం పెరుగుతుం ది. సబ్ లెఫ్టినెంట్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 5,400; లెఫ్టినెంట్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 6,100; లెఫ్టినెంట్ కమాండర్: రూ. 15,600 - రూ. 39,100, గ్రేడ్ పే రూ. 6,600; కమాండర్: రూ. 37,400 - రూ. 67,000, గ్రేడ్ పే రూ. 8,000. అన్ని కేడర్‌లకు రూ.6,000 మిలిటరీ సర్వీస్ పే ఉంటుంది. నిబంధనల మేరకు అలవెన్సులుంటాయి.

 

 నియామక ప్రక్రియ

 దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీం ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2015 డిసెంబర్ నుంచి 2016 ఏప్రిల్ మధ్యలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/కోయంబత్తూరు/విశాఖపట్నంలో నిర్వహిస్తారు.



ఎస్‌ఎస్‌బీ: ఇందులో పరీక్షలను అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం పంపుతారు.



శిక్షణ : అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2016 జూన్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. యూనివర్సిటీ ఎంట్రీ స్కీం కింద ఎంపికైన అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఆఫీసర్లుగా నియమిస్తారు. 22 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సును అందిస్తారు. దీంతోపాటు నేవల్ షిప్స్, ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో ప్రొఫెషనల్ శిక్షణ ఇస్తారు. జనరల్ సర్వీస్ కేటగిరీలో ఎగ్జిక్యూటివ్ ఎంట్రీకి ఎంపికైన అభ్యర్థులకు 44 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది.



సబ్‌మెరైన్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ పొందుతారు. సబ్‌మెరైన్ క్వాలిఫైయింగ్ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఇందులో అనర్హులైన వారిని సర్వీస్‌కు ఎంపిక చేయరు.



{పొబేషన్: అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులై, సర్వీస్‌కు ఎంపికైన వారిని తొలుత సబ్‌లెఫ్టినెంట్ కేడర్‌లో నియమిస్తారు. వీరికి రెండేళ్లు ప్రొబేషన్ ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19, 2015.

ఒకటి కంటే ఎక్కువ కేడర్‌లకు అర్హులైనప్పటికీ ఒకటే దరఖాస్తు పంపాలి. అయితే వాటిలో ప్రాధాన్యతలను సూచించాలి.

వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top