అలహాబాద్ హైకోర్టులో 343 రివ్యూ ఆఫీసర్ పోస్టులు

అలహాబాద్ హైకోర్టులో 343 రివ్యూ ఆఫీసర్ పోస్టులు

అలహాబాద్ హైకోర్టు.. రివ్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు 

 ‘రివ్యూ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2016’ను నిర్వహించనుంది. 

 

 ఖాళీల వివరాలు

 మొత్తం పోస్టులు 343. అయితే ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వ్ చేసిన 171 పోస్టుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆయా కేటగిరీల వారినే నియమిస్తారు. ఇవి పోను మిగిలిన 172 పోస్టులకు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ పడాల్సి ఉంటుంది. 

 

 వేతనం: రూ.9,300-34,800+గ్రేడ్‌పే రూ.4,800. 

 విద్యార్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ; కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా/డిగ్రీ లేదా ఎన్‌ఐఈఎల్‌ఐటీ/డీఓఈఏసీసీ సొసైటీ జారీచేసిన ‘ఒ’ లెవల్ సర్టిఫికెట్ లేదా సీసీసీ సర్టిఫికెట్. డేటా ఎంట్రీ, వర్డ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం.

 

 వయసు: 2016, జూలై 1 నాటికి కనీసం 21 ఏళ్లు, గరిష్టం 35 ఏళ్ల లోపు ఉండాలి.

 ఎంపిక విధానం: రెండు దశల్లో నిర్వహించే పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండున్నర గంటల (150 నిమిషాల) వ్యవధిలో జరిగే మొదటి దశ పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు (200 మార్కులు కేటాయించారు) జవాబులు గుర్తించాలి. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఒక పోస్టుకు ఐదుగురు చొప్పున రెండో దశ పరీక్ష (కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్-సీకేటీ)కి ఎంపిక చేస్తారు. 15 నిమిషాల వ్యవధిలో జరిగే సీకేటీలో సుమారు 500 పదాలు గల ఇంగ్లిష్ కంటెంట్‌ను కంప్యూటర్‌లో కంపోజింగ్ (టైపింగ్) చేయాలి. దీనికి 50 మార్కులు కేటాయించారు. 

 

 ఇందులో కనీసం 17 మార్కులు సాధించాలి.  

 రాత పరీక్ష సిలబస్: జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం; భారత రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, సంస్కృతి, వ్యవసాయం, వాణిజ్యం, జనాభా, జీవావరణ శాస్త్రం; ప్రపంచ, భారత భూగోళశాస్త్రం, వనరులు; జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల వర్తమానాంశాలు; జనరల్ ఇంటెలిజెన్స్; ఉత్తరప్రదేశ్‌లోని విద్య, సంస్కృతి, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వాణిజ్యం, జనజీవనం, సామాజిక సంప్రదాయాలు; గ్రాడ్యుయేషన్ స్థాయి సాధారణ ఆంగ్ల, హిందీ భాషల పరిజ్ఞానం, కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం. 

 

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

 దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. 

 

 ముఖ్య తేదీలు

 1.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

 డిసెంబర్ 15, 2016.

 2.ఇ-చలాన్ ద్వారా ఆఫ్‌లైన్లో ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 16

 వెబ్‌సైట్:  www.allahabadhighcourt.in           
Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top