అక్కా సారీ! అంటూ సెండ్‌కాని ఓ మెసేజ్

అక్కా సారీ! అంటూ సెండ్‌కాని ఓ మెసేజ్ - Sakshi


విజయనగరం కంటోన్మెంట్/గంట్యాడ: కట్టుకున్నవాడు నిరంతరం అనుమానంతో వేధిస్తుంటే తట్టుకోలేకపోయింది ఆ తల్లి. తండ్రి తనువు చాలిస్తే కనీసం ఆ విషాదం నుంచి తేరుకోకముందే సంక్రాంతి పండగ చేసుకోవాలని సతాయిస్తే... భర్త వెంట ఇంటికి చేరింది. మానసికంగా ఆమె ఎంత మధనపడిందో కానీ ఇద్దరు కుమారులతో కలసి ఆత్మహత్య చేసుకుంది. గంట్యాడ మండలం రామవరంలో బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.

 

  గ్రామానికి చెందిన కలిదిండి సరస్వతి(35) తన ఇద్దరు కుమారులు సాయివర్మ(14), హర్షవర్ధన్‌లతో సహా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం సరస్వతి పెద్దక్క ఫోను చేస్తున్నా ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోను చేశారు. ఆ సమయంలో పొలంలో ఉన్న వారు ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా ముగ్గురూ ఫ్యానుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించడాన్ని చూసి తిరిగి ఫోను చేసి చెప్పారు. ఇంతలో పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి తలుపులు విరగ్గొట్టి మృతదేహాలను బయటకు తీశారు.

 

 పదహారేళ్ల క్రితమే వివాహం

 రామవరం గ్రామానికి చెందిన కలిదిండి నరసింహ రాజుకు భీమిలి మండలం చిప్పాడ దగ్గర్లోని మూలకుద్దు గ్రామానికి చెందిన సరస్వతితో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రారంభంలో బాగానే ఉన్న వీరి మధ్య లో కొన్నాళ్లుగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహరాజు తరచూ భార్యను హింసిస్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను వేధిస్తుండే వాడ ంటున్నారు. సరస్వతికి ఇద్దరు అక్కలున్నారు. పెద్దక్క కన్నమ్మ విజయనగరంలోని గాజుల రేగలో నివాసముంటుండగా కొన్నాళ్ల నుంచీ తల్లిదండ్రులు ఈమె వద్దే నివాసం ఉంటున్నారు.

 

 సరస్వతి తండ్రి గత నెల 6న విజయనగరంలో మృతి చెందారు. విషాదంతో ఉన్న తల్లి వద్ద కొన్ని రోజు లుందామని అనుకున్న సరస్వతిని సం క్రాంతికి తమ పెద్దలకు బట్టలు చూపిం చాలని వెంటనే పండగకు రమ్మని భర్త ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయం లో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సరస్వతి తల్లి రమాదేవి ఇద్దరినీ మందలించి సయోధ్య కుదిర్చి కూతుర్ని అల్లుడితో పంపించింది. ఇంతలోనే ఆమె ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని ఆమె ఊహించలేదు. సమాచారం అందుకున్న ఆమె కన్నవారు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపిం చారు. తన అల్లుడు నరసింహరాజుపై నే తమకు అనుమానం ఉందని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై తిరుపతిరావు, సీఐ రవికుమార్‌లు ప్రాధమిక పరిశీలన చేశారు. సమాచారం అందుకున్న నరసింహరాజు కూడా అక్కడకు చేరుకున్నాడు.

 

 అక్కా సారీ! అంటూ సెండ్‌కాని ఓ మెసేజ్


 అక్కా సారీ! అంటూ తన పెద్దక్క కన్నమ్మకు సెంట్‌కాని మెసేజ్‌ను పెట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు. తన అక్కకు కూడా చెప్పలేని విషయాలేమయినా ఉన్నాయా? లేకపోతే కేవలం సారీ అని మాత్రమే చెబుతూ తన ఆవేదనను ఒకే పదంలో చెప్పాల్సిన బాధ ఏమొచ్చిందన్నది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశముంది.

 

 ఇద్దరు కుమారులూ ప్రతిఘటించలేదా?

 ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న సరస్వతిని ఇద్దరు పిల్లలు ప్రతిఘటించలేదా? నువ్వు చనిపోవద్దు, మేమూ చావొద్దనే విషయాన్ని కూడా చెప్పలేకపోయారా? ఇద్దరినీ ఎలా ఉరికి సిద్ధం చేసిందన్నది ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నకైమ్ డీఎస్పీ సందర్శనసమాచారం అందుకున్న క్రైం డీఎస్పీ కృష్ణప్రసన్న రామవరంలోని సంఘటనా స్థలానికి బుధవారం రాత్రి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.  సంఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. దీనిపై సీఐ రవికుమార్ మాట్లాడుతూ సంఘటనను లోతుగా పరిశీలిస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదనీ, వెంటనే విచారణ ప్రారంభించామనీ చెప్పారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top