నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం

నాణ్యమైన విద్యనందించడమే  ప్రభుత్వ లక్ష్యం - Sakshi


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

 


జడ్చర్ల : తెలంగాణలోని పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 8 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి ఉత్తమమైన అధ్యాపకులను నియమించామన్నారు. 



అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను సైతం త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత స్థాయిలో రానిస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం నాటికి దాదాపు 5 నుంచి 10 ఎకరాల స్థలంలో అన్ని హంగులతో సొంత భవనాన్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

 

ఇదే హాస్టల్‌లో ఉండి చదివా..


తాను జడ్చర్లలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాల భవనంలో కొనసాగిన హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌కు ధీటుగా ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలను వినియోగించుకోవాలన్నారు. పేదల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ మాసుమాబేగం, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్నీ, ప్రిన్సిపాల్ నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top