సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి? | what are top five priorites of seemandhra cm? | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి?

Mar 21 2014 2:10 PM | Updated on Oct 20 2018 7:44 PM

సీమాంధ్ర ప్రాంతానికి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? వాళ్లు ప్రధానంగా చేయాల్సిన ఐదు పనులు ఏవేంటి?

అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నాయకులు చాలా హామీలు ఇస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల కాలం కావడంతో అందరి దృష్టీ కొత్తగా ఏర్పడుతున్న సీమాంధ్ర రాష్ట్రం మీదే ఉంది. రాబోయే పదేళ్ల పాటు అక్కడి ఏడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఉండటం, టాక్స్ హాలిడేలు తదితర అంశాల నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేయడానికి కావల్సినంత అవకాశం ఉంది. అనేక రంగాలలో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయచ్చు.

వ్యవసాయం వెన్నెముకగా ఉన్న సీమాంధ్ర ప్రాంతాన్ని అసలు వ్యవసాయమే లేని సింగపూర్లా తయారుచేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. అసలు సీమాంధ్ర ప్రాంతానికి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? వాళ్లు ప్రధానంగా చేయాల్సిన ఐదు పనులు ఏవేంటి? ఏం చేస్తే ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుంది? పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఓడరేవుల అభివృద్ధి.. ఇలా ఏవైనా కావచ్చు. మీ సూచనలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement