రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు జపాన్ రూపొందించిన డిజైన్‌పై విమర్శలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.
డిజైన్‌ను పూర్తిగా మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు జపాన్ రూపొందిం చిన డిజైన్‌పై విమర్శలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. జపాన్ కంపెనీతోనే మళ్లీ కొత్తగా డిజైన్ తయారు చేయించాలని నిర్ణయించింది. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు. ఈ డిజైన్ కోసం సీఆర్‌డీఏ మూడు నెలల పాటు కసరత్తు చేసింది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ పెట్టింది. 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాలు, వీఐపీల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆయా ప్రదేశాల్లో గ్రీనరీ (పచ్చదనం) ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేయాలని సూచించింది.
అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా అత్యద్భుతంగా ఉండాలని సచివాలయం అదేస్థాయిలో ఉండాలని పేర్కొంది. ఉత్తమ డిజైన్ ఎంపికకు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలో దేశ, విదేశీ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు రూపొందించగా అంతిమంగా జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, భారత్‌కు చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ డిజైన్‌లను తుదిపోటీకి ఎంపిక చేసింది. గత నెలలో ఈ మూడు డిజైన్లను పరిశీలించిన జ్యూరీ చివరకు జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.