
యనమల రామకృష్ణుడు
ఎర్రచందనం అమ్మకం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇందు కోసం కేంద్రం అనుమతి కోరినట్లు తెలిపారు. గడచిన నెలరోజుల్లో శక్తికి మించి ఏపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. రుణాల రీషెడ్యూల్ తొలి సంతకం అమలులో భాగమేనని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి గృహాలు, పరిశ్రమలకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటలపాటు విద్యుత్ అందిస్తామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా పథకం కింద ఏపీని కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు.
సింహాచలం అప్పన్న ఆలయ భూములను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇకపై సంక్షేమ పథకాలను ఆధార్ కార్డు ఆధారంగా అమలు చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి తక్షణ సాయంగా 5 వేల కోట్ల రూపాయలు కోరినట్లు మంత్రి తెలిపారు.