మే 5న ఏపీ ఎంసెట్‌ ఫలితాలు


- కన్వీనర్‌ సాయిబాబు వెల్లడి

- మెయిళ్ల ద్వారా అభ్యర్థులకు జవాబుపత్రాలు




సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్‌–2017 ఫలితాలు మే 5న విడుదల చేయనున్నామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌.సాయిబాబు తెలిపారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ని వెబ్‌సైట్లో పొందుపరిచామని కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. ఈ కీపై అభ్యంతరాలు ఉంటే మే 1వ తేదీ సాయంత్రం అయిదు గంటల వరకు స్వీకరిస్తామని చెప్పారు.



ఈ అభ్యం తరాలను వెబ్‌సైట్లో నిర్దేశించిన ఫార్మా ట్‌లోనే పంపిం చాలని సూచిం చారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశపరీక్షకు సంబంధించి విద్యార్థుల జవాబు పత్రాన్ని వారి ఈమెయిల్‌ అడ్రస్‌కు పంపిస్తున్నామని, వెబ్‌సైట్‌లోనూ పొందుపరుస్తు న్నామని చెప్పారు.  ఎంసెట్‌ ఫలితాలను మే 5న విడుదల చేయాలని నిర్ణయించి నందున ఇంటర్మీడియెట్‌ కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీఓఎస్‌ఎస్, ఎన్‌ఐఓఎస్, డిప్లొమో, ఆర్జేయూకేటీ, ఐఎన్‌సీ, ఇంట ర్మీడియెట్‌ ఒకేషనల్‌ ఇతర బోర్డుల ధ్రువ పత్రాలతో పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ప్రత్యేక డిక్లరేషన్‌ ఫారాలను, మార్కుల జాబితాలను తమకు ముందుగా పంపాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top