ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు: బాలకృష్ణ | Andhar Pradesh will have great prosperity: Balakrishna | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు: బాలకృష్ణ

Jun 4 2014 9:36 PM | Updated on Aug 29 2018 1:59 PM

ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు: బాలకృష్ణ - Sakshi

ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు: బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష(టీడీఎల్పీ) నేతగా చంద్రబాబునాయుడు ని ఎన్నుకోవడం శుభప్రదం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 
 
టీడీఎల్సీ నేతగా ఎంపికైన చంద్రబాబుపై బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనాదక్షుడు అని బాలకృష్ణ అన్నారు. అభివృద్ది చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడికి ఉందని బాలకృష్ణ అన్నారు. 
 
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును ఆపార్టీ సీనియర్ నేత కృష్ణమూర్తి  ప్రతిపాదించగా,  ఎమ్మెల్యేలు బలపరిచారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement