పీజీ మెడికల్లో 879 సీట్లు భర్తీ
పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో ఆదివారం నాటికి 879 సీట్లు భర్తీ అయ్యాయి. క్లినికల్ డిగ్రీలో 610, నాన్ క్లినికల్ డిగ్రీలో 96, క్లినికల్ డిప్లొమాలో 164, నాన్ క్లినికల్ డిప్లొమాలో 9 సీట్లు భర్తీ అయ్యాయి.
ఆదివారం ఒక్కరోజే 166 సీట్లు భర్తీ చేశారు. ఓపెన్ కేటగిరీలో 338, బీసీ కేటగిరీలో 363, ఎస్సీ కే టగిరీలో 140, ఎస్టీ కేటగిరీలో 38 సీట్లు భర్తీ అయ్యాయి. సోమవారం జరిగే కౌన్సెలింగ్కు 3001 నుంచి 5500 ర్యాంకుల వరకు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులను ఆహ్వానించారు.