Breaking News

5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్‌ టెక్నాలజీ

Published on Fri, 01/16/2026 - 15:12

ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన పడవను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విస్కాన్సిన్‌లోని పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన ఈ పడవను గుర్తించారు. ఇక్కడ మొత్తం 16 పురాతన బోట్లను గుర్తించడం విశేషం. 

 న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం ఉత్తర అమెరికాలోని విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీ (WHS) పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన పడవను కనుగొన్నారు. మెన్డోటా సరస్సులో మొత్తం 16 పురాతన బోలు చెక్క పడవలను పరిశోధకులు గుర్తించారు. ఈ పడవలలో పురాతనమైనది ఈజిప్టులోని గిజా పిరమిడ్ ఉనికిలో ఉండటానికి ముందు కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో అనుకున్న దానికంటే చాలా ముందుగానే జీవించి వ్యవస్థీకృత సమాజాలుగా అభివృద్ధి చెందారని వెల్లడిస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

సహజంగా రేడియోధార్మిక మూలకం ఎంతవరకు క్షీణించిందో చూడటానికి కలపను పరీక్షించినప్పుడు, ఈ పడవలు 1300AD , 3000BC మధ్య నిర్మించబడ్డాయని తేలింది. మెండోటా సరస్సు కింద కనుగొనబడిన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు ఉత్తర అమెరికాలో ప్రారంభ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.వేల ఏళ్లకుముందే ప్రపంచవ్యాప్తంగా మానవ పడవ తయారీ నైపుణ్యాలు అభివృద్ధి గురించి వివరించింది. ఈ పడవలు 5,200 సంవత్సరాల క్రితం గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణించారు, ఎలా నివసించారో ఇది వెల్లడిస్తుంది.  ముఖ్యంగా ఆ కాలంలోనే ఇక్కడి ప్రజలు బలమైన, మన్నికైన ఓడలను నిర్మించేంత అవగాహన , సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం విశేషం.

2021లో శాస్త్రవేత్తలు 1,200 సంవత్సరాల నాటి మొదటి పడవను కనుగొన్నారు. 3,000 సంవత్సరాల నాటి మరో పడవను 2022లో కనుగొన్నారు. ఆ తర్వాత మరో పద్నాలుగు పడవలు  గుర్తించారు. వాటిలో ఆరు 2025లో కనుగొనబడ్డాయి. 16 పడవలలో రెండు మాత్రమే నీటి నుండి బయటకు తీశారు. వీటిలో దాదాపు 3,000 సంవత్సరాల నాటి 14 అడుగుల పొడవైన పడవ కూడా ఉంది. ఇవి ఎక్కువగా ఎరుపు , తెలుపు ఓక్ వంటి గట్టి చెక్కలతో తయారు చేసినవి. పడవల పైన రాళ్లను జాగ్రత్తగా ఉంచారట. శీతాకాలంలో పడవ తయారీకి ఉపయోగించే చెక్క వంకర పోకుండా చూసుకోవడానికి ఈజాగ్రత్త తీసుకుని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే WHS బృందం ఓక్‌ను ఉపయోగించడం అసాధారణ మని  పేర్కొంది. సాధారణంగా చెట్టుకు ఉండే ఓపెన్‌ పోర్స్‌ నీటిని గ్రహిస్తాయి. ఇవి  పడవలు మునిగిపోకుండా తేలియాడేలా చేస్తుంది.

ఇదీ చదవండి: టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)