Breaking News

Hyderabad: యువతి దారుణ హత్య.. చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..

Published on Sat, 01/25/2025 - 07:23

మేడ్చల్‌రూరల్‌: ఓఆర్‌ఆర్‌ కల్వర్టు కింద గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మునీరాబాద్‌ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. నిందితులు యువతి తలపై బండరాయితో మోది.. హత్య చేసి.. మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఆనవాళ్లున్నాయి. మేడ్చల్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మునీరాబాద్‌ పరిధిలో ఔటర్‌ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో పని చేసే ఓ యువకుడు శుక్రవారం ఉదయం కల్వర్టులో నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్తుండగా ఓ యువతి మృతదేహం కనిపించింది. 

భయాందోళనకు గురైన యువకుడు ట్రాన్స్‌పోర్టు యజమానికి విషయం చెప్పగా.. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని మేడ్చల్‌  ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. 25 ఏళ్ల వయసున్న వివాహిత తలపై బండరాయితో బాది హత్య చేసి.. ఆపై పెట్రోల్‌ పోసి నిందితులు నిప్పంటించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.  

తెలిసిన వ్యక్తుల పనేనా?  
ఓఆర్‌ఆర్‌ కల్వర్టు కింద యువతి దారుణ హత్యకు గురైన యువతి పడి ఉన్న  తీరును పరిశీలించిన పోలీసులు.. సదరు యువతి తనకు తెలిసిన వ్యక్తి లేదా వ్యక్తులతోనే ఇక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. యువతిని ఏకాంతంగా కలిసిన అనంతరం విభేదాల కారణంగా పక్కనే ఉన్న బండరాయితో బాది హత్య చేశారా? లేదా పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకువచ్చి దారుణానికి ఒడిగట్టారా? లేదంటే యువతి మృతదేహాన్ని తీసుకు వచ్చి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు బండరాయితో బాది.. పెట్రోల్‌ పోసి నిప్పు అంటించి ఉంటారా? నిందితుడు ఒక్కరా లేక ఇద్దరు.. ముగ్గురు ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 దిశ కేసు తరహాలో రోడ్డు పక్కన యువతి దారుణ హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది.  

మృతురాలి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్టు ..  
హత్యకు గురైన యువతి చేతులపై ముగ్గురి పేర్లతో పచ్చబొట్లు ఉన్నాయి. కుడి చేతిపై శ్రీకాంత్‌ అని తెలుగులో.. రోహిత్‌ అనే పేరు ఇంగ్లిష్‌లో.. ఎడమ చేతిపై నరేంద్ర అనే పేరు ఇంగ్లిష్‌ లో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల వయసున్న యువతికి కాళ్ల వేళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా వివాహితగా గుర్తించారు.  ఇతర పోలీస్‌స్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసులు, ఆయా కేసుల్లో చేతిపై పచ్చబొట్లు ఉన్న వివరాల కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.   

మునీరాబాద్‌లో దారుణం.. మహిళ దారుణ హత్య?


 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)