'మా ఇంటికి ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి' అనడమే శాపమైంది..

Published on Mon, 07/20/2026 - 08:57

హైదరాబాద్‌, బహదుర్‌పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ కలీల్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్‌ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్‌ ఫైజ్‌ ఎలియస్‌ అజాన్‌ (17) ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

ఐదేళ్ల క్రితం కాలాపత్తర్‌లో ఉన్న అబ్రార్‌ ప్రస్తుతం బాలాపూర్‌లో  నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్‌ తన స్నేహితులు ఆశ్వక్‌ (21), పర్హాన్‌ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్‌ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్‌లను వెంటబెట్టుకుని కాలాపత్తర్‌ బిర్యానీ షా టెకిడీలోని అజాన్‌ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్‌ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్‌ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్‌ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్‌ మామ సాధిక్‌ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్‌ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)