Breaking News

శివాజీ చిల్లర వ్యాఖ్యలపై తెలంగాణా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఫైర్‌

Published on Wed, 12/24/2025 - 12:13

సాక్షి, హైదరాబాద్‌:  సినీ నటుడు శివాజీ నటుడు హీరోయిన్ల దుస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  సునీతా రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వేదికపై శివాజీ మహిళలను అవమానించాడో అదే వేదికపై  బే షరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మహిళలను అవమానించడంఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్యానించిన సునీతా రావు, శివాజీ నోటి దురుసుతనంపై మహిళా కమిషన్‌ సీరియస్‌గా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళల బట్టలు గురించి  మాట్లాడటానికి మీరెవరు,  పురుషుల దుస్తులు ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలని  మహిళలు ఎక్కడైనా  మాట్లాడారా అని  సునీతా ప్రశ్నించారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం శివాజీకి అలవాటేనని విమర్శించారు. సనాతన ధర్మం అంటూ మహిళలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న శివాజీకి బీజేపీ సంస్కృతి వంట పట్టినట్లు ఉంది  అంటూ మండిపడ్డారు.

కాగా  దండోరా సినిమా ఈవెంట్‌లో  శివాజీ మహిళలపై దుస్తులుపై నోరు పారేసుకున్నాడు. సభ్యత సంస్కారం మరిచి అసభ్య పదజాలంతో వ్యాఖ్యాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. గాయని  చిన్మయి, నటి అనసూయ, దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ హీరోలు మంచు మనోజ్‌, కమల్‌ కామరాజు కూడా  తీవ్రంగా స్పందించారు. వీరితోపాటు  సోషల్‌ మీడియాలో శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో , తప్పయింది క్షమించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు.  మరోవైపు మహిళా కమిషన్‌కూడా శివాజీపై  తీవ్రంగా  స్పందించి నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)