Breaking News

నీవు నాకు తెలుసు.. నీ నంబర్‌ నా దగ్గర ఉంది..!

Published on Sun, 04/13/2025 - 11:31

వట్‌పల్లి(అందోల్‌): ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వివాహిత మహిళను అత్యాచారం చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలతోపాటు సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన ఘటన వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగు చూసింది.  ఎస్‌ఐ విఠల్‌ కథనం మేరకు.. మండల పరిధిలోని పల్వట్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత(35) ఆదివారం జోగిపేటలో చీరలు కొన్నది. చీర డ్యామేజ్‌ ఉండటంతో తిరిగి ఇవ్వడానికి గురువారం జోగిపేటకు వెళ్లింది. 

ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్‌ రాగా లిఫ్ట్‌ చేసి మాట్లాడగా.. కొత్త వ్యక్తి అని ఫోన్‌ కట్‌ చేసింది. మళ్లీ ఫోన్‌ చేసి నీవు నాకు తెలుసు, నీ నంబర్‌ నా దగ్గర ఉంది.. అంటూ పరిచయం చేసుకొని ఎక్కడ ఉన్నావు అని అడుగగా తాను ఉన్న బట్టల షాపు అడ్రస్‌ చెప్పింది. వెంటనే   అక్కడికి వచ్చి వ్యక్తి ఆమె డబ్బులను షాపులో చెల్లించాడు. షాపింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మహిళను బైక్‌పై  ఎక్కించుకున్నాడు. అల్లాదుర్గం మండలం బహిరన్‌దిబ్బ గ్రామ రోడ్డు సమీపంలోకి రాగానే వర్షం రావడంతో తన బైక్‌ను నిలిపాడు. మళ్లీ రాత్రి 8 గంటల ప్రాంతంలో మహిళను ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  

అనంతరం బైక్‌పై వట్‌పల్లి మీదుగా బాధిత మహిళ గ్రామం పల్వట్ల వైపు వెళ్తూ నాగులపల్లి గ్రామ సమీపంలోకి రాగానే మహిళను దిగమన్నాడు. నన్ను మా ఇంటి దగ్గర దించాలంటూ ఆమె బైక్‌ దిగలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. అతడు మహిళను బయపెట్టి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, సెల్‌ఫోన్‌ తీసుకొని పరారయ్యాడు. బాధిత మహిళ అదే రాత్రి వట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్‌డేటా ఆధారంగా మనూర్‌ మండలం బెల్లాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు.

Videos

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)