Breaking News

గొంతు కోసుకొని మహిళ ఆత్మహత్య

Published on Wed, 10/01/2025 - 08:16

హైదరాబాద్‌: భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అస్సాంకు చెందిన ఓ మహిళ హోటల్‌లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తకు వైద్యం చేయించేందుకు వచ్చి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం, లఖింపూర్‌ జిల్లాకు చెందిన అడ్వకేట్‌ అపూర్వ జ్యోతి శర్మ  ఆరు నెలలుగా కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతున్నాడు.

 భార్య ప్రణిత శర్మ(45), ఆమె సోదరి భర్తతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పిటల్‌లో ఈ నెల 20న చేర్పించారు. ఏఐజీలో చికిత్స తీసుకుంటూ గచ్చిబౌలిలోని బాబుఖాన్‌ లేన్‌లోని ఆకాశ్‌ హోటల్‌ రూమ్‌ నెంబర్‌ 303లో ఉంటున్నారు. ఈ నెల 25న సోదరి భర్త స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అపూర్వ జ్యోతి శర్మకు ట్రీట్‌మెంట్‌ పూర్తి కావడంతో మంగళవారం తిరిగి వెళ్లాల్సి ఉంది. సోమవారం రాత్రి హోటల్‌లో నిద్రకు ఉపక్రమించిన భర్త 11.30 గంటల సమయంలో లేచి చూడగా భార్య కనిపించలేదు. బాత్‌రూమ్‌ డోర్‌ వెనక గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా పలక లేదు. తలుపు తెరిచేందుకు ప్రయత్నింగా వీలు కాలేదు. 

పక్క గదిలో ఉన్న వారి సహాయంతో డోర్‌ పగులగొట్టి చూడగా గొంతు కోసుకొని తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందింది. లివర్‌ వ్యాధితో భర్తకు ప్రాణ భయం ఉంటుందేమోనని ఆలోచిస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందని,  సోమవారం రాత్రి దేవున్ని ప్రారి్ధంచిందని, అనంతరం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె తరపు బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృత దేహన్ని ఏఐజీ ఆప్పత్రి మార్చురీలో భద్రపరిచారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)