కొత్త హైకోర్టు పనులు.. ఇక సైట్‌లోనే సమీక్షలు!

Published on Tue, 12/30/2025 - 21:16

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు సముదాయాన్ని గడువులో పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రాజెక్టులో జాప్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైట్‌లోనే వారాంత సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాలకు కన్సల్టెంట్‌తో పాటు నిర్మాణ, ఎంఈపీ ఉపకన్సల్టెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.

పనుల వేగం పెరగాలంటే సాంకేతిక సిబ్బంది, ఉపకన్సల్టెంట్ల సంఖ్యను వెంటనే పెంచాలని ఆదేశించిన వికాస్‌రాజ్, ఒప్పంద పరిధిలోనే స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థను నియమించి సాంకేతిక సలహాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఈ (బిల్డింగ్స్)కు ఆదేశించారు.

డ్రాయింగ్‌లను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం కనీసం రెండు నెలలు ముందుగానే సమర్పించాలని, అలా చేయడం వల్ల సామగ్రి కొనుగోలు, కార్మికుల సమీకరణ సకాలంలో జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. డ్రాయింగ్‌ల జారీలో జాప్యం జరిగితే, ప్రాజెక్టు పురోగతికి భంగం కలగకుండా ప్రత్యామ్నాయ కన్సల్టెంట్‌ను నియమించే అధికారం ఇంజినీరింగ్ విభాగానికి ఉంటుందని హెచ్చరించారు.

ప్రాజెక్టు గడువు తప్పకుండా నిలబెట్టేలా శాఖ, కాంట్రాక్టర్‌, కన్సల్టెంట్ ముగ్గురూ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఆర్కిటెక్చరల్ రూపకల్పన, ఎంఈపీ షాఫ్టులు తదితర అంశాలను సివిల్‌, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు కలిసే సమీక్షించి, జాతీయ భవన నియమావళి (ఎన్‌బీసీ) ప్రమాణాలకు అనుగుణంగా తుది డ్రాయింగ్‌లను ధృవీకరించాలని స్పష్టం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)