Breaking News

'ఫ్రీ' ఫైట్.. హై వోల్టేజ్.. చల్లారని ఉచిత విద్యుత్‌ మంటలు..

Published on Sun, 07/16/2023 - 00:59

ఉచిత విద్యుత్‌ మంటలు చల్లారడం లేదు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత రాజుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా రైతులకు ఉచిత విద్యుత్‌ చుట్టూనే తిరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విరుచుకుపడుతున్నారు. మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇటీవలి అమెరికా పర్యటనలో రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. ‘ఒక ఎకరానికి నీరు పారించాలంటే గంట చాలు.

మూడెకరాలకు ఫుల్లుగా నీరు పారాలంటే మూడు గంటలు... టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్‌ సంస్థల దగ్గర కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలనే స్లోగన్‌ తీసుకొచ్చిండు..’ అంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ దీన్ని అందిపుచ్చుకొని.. ఉచిత విద్యుత్‌ ఎత్తేసేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందంటూ మండిపడింది. ఆత్మరక్షణలో పడిన ప్రతిపక్ష పార్టీ నష్ట నివారణకు దిగింది.

ఉచిత విద్యుత్‌ ప్రవేశపెట్టిందే తామని, దానికి కట్టుబడి ఉన్నామంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌పైనే ఎన్నికలకు వెళదామని, ఎవరు విద్యుత్‌ ఇచ్చారో, ఇవ్వలేదో ప్రజలే నిర్ణయిస్తారని, రెఫరెండంకు కాంగ్రెస్‌ సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. దీనిపై రేవంత్‌రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అదేదో సబ్‌స్టేషన్ల వద్దే తేల్చుకుందామన్నారు. మరోవైపు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా క్షేత్రస్థాయిలో 10 రోజుల కార్యాచరణకు పిలుపునివ్వడం ద్వారా ఈ అంశాన్ని ఇంతటితో వదలబోమనే సంకేతాలను బీఆర్‌ఎస్‌ ఇచ్చింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)