Breaking News

రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!

Published on Tue, 07/22/2025 - 09:13

వికారాబాద్: ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్‌ (33)కు ఇదే మండలం కోత్లాపూర్‌ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. 

వీరికి ఈశ్వర్‌ ప్రసాద్‌ (10), సుకుమార్‌ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్‌ కాల్‌ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్‌ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్‌ మాట్లాడుతూ కనిపించింది. 

ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్‌ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్‌ సీఐ నగేశ్, ఎస్‌ఐలు రాథోడ్‌ వినోద్, సాజిద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)