Breaking News

పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు

Published on Sat, 12/14/2024 - 09:33

కాజీపేట: ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కొట్టి చంపి ఏడాది కాలం గడిచినా.. హంతకుల ఆనవాళ్లు పోలీసులకు చిక్కకపోవడం చర్చనీ యాంశంగా మారింది. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణం 62వ డివిజన్‌ రహమత్‌ నగర్‌ కాలనీలో ఉండే కోన విజయ (68) అనే మహిళ గత ఏడాది డిసెంబర్‌ 14న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి విగతజీవిగా ఇంటి పక్క సందులో కనిపించింది. విజయ మృతదేహంపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతోపాటు బంగారు నగలు కనిపించకుండాపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో విజయ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

విభిన్న కోణాల్లో పోలీసుల విచారణ.. 
పోలీసు అధికారులు కేసు నమోదు చేసి క్లూస్‌ టీం సభ్యులు, డ్వాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయ దాదాపు 16 గంటలపాటు పట్టణంలో ఎక్కడ ఉంది.. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నిందితులు హత్యచేసి ఇంటి వద్ద పడేసి ఉంటారా.. లేక తెల్సిన వాళ్లకు అప్పుడప్పుడు చిన్న మొత్తంలో నగదును ఇస్తుండే విజయను మరెవరైనా హత్య చేశారా.. 

అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినా ఆచూకీ లభించలేదు. అయితే .. విజయను ఏమార్చి కిడ్నాప్‌ చేసిన నిందితులు తలపై బలంగా కొట్టి చంపడంతోపాటు శరీరాన్ని పూర్తిగా సబ్బు పెట్టి కడిగి మృతురాలి ఇంటి పక్కన ఉన్న గల్లీలోనే అర్ధరాత్రి వేళ పడేసి వెళ్లారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో వెతికినా హత్యప్రదేశాన్ని గుర్తించకుండా ఉండేందుకు నిందితులు సబ్బుతో కడిగి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. 

మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగల కోసమే హత్య చేసి ఉంటారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉంటాయా.. అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పోలీసులకు నిందితులకు సంబంధించిన ఆచూకీ చిక్కకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. హత్య జరిగినప్పుడు ఉన్న అధికారులు బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన అధికారులు హత్య కేసు ఫైల్‌ను తిరిగి తెరచి విచారణ జరుపుతున్నారు. ఘటనా సమయంలో ఉన్న అధికారులు ఒక క్రమపద్దతిలో విచారణ చేయకపోవడం కారణంగానే సమస్య తీవ్రత పెరగడంతోపాటు నిందితులు దొరక్కుండా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు ఇప్పటి వరకు సుమారు 100మందిని విచారించారు. చిన్న క్లూ దొరికినా విడిచి పెట్టకుండా నేరస్తుల ఆట కట్టిస్తున్న పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. విజయ కేసులో నానాటికీ చిక్కుముడులు పెరుగుతున్నాయి. మొదట్లో కేసును సునాయాసంగా పరిష్కరించవచ్చని భావించిన పోలీసులకు గతంలో వచ్చిన దృశ్యం సినిమాను జ్ఞప్తికి తేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా క్రైమ్‌ సమీక్ష సమావేశాల్లో తరచూ ఈ కేసును పరిష్కరించాలంటూ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసుల విచారణ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.

  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)