Breaking News

బతికుండగానే స్మశానానికి... కంటతడి పెట్టిస్తున్న ఘటన!

Published on Fri, 11/06/2026 - 11:14

సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మర్రిపల్లి రాకేష్‌ను కుటుంబ సభ్యులు వేములవాడ వైకుంఠధామానికి తరలించారు. చనిపోకముందే స్మశానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఈ ఘటన స్థానికంగా కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత కుటుంబం కొన్నేళ్లుగా వేములవాడలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. రాకేష్ కొంతకాలంగా జాండీస్‌, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో రాకేష్ పరిస్థితి చూసి ఇంటి యజమాని అద్దె ఇంట్లోకి కూడా అనుమతించలేని దుస్థితి ఏర్పడిందంటూ కుటుంబ సభ్యులు వాపోయారు.

దీంతో దిక్కుతోచని స్థితిలో రాకేష్‌ను వైకుంఠధామానికి తీసుకెళ్లినట్లు, చివరికి చావే పరిష్కారం అన్నట్లుగా.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం మంటగలిసిందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, రాకేష్‌కు తగిన సహాయం అందించాలని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఏం కష్టమొచ్చింది తల్లులూ!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)