ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి..

Published on Fri, 01/02/2026 - 14:06

సికింద్రాబాద్ (రాంగోపాల్‌పేట): ఎటు చూసినా పండుటాకులే.. ఒక్కొక్కరిని కలుస్తూ ఆయన అలా ముందుకుపోతున్నారు.. మిఠాయిలు, పండ్లు అందిస్తున్నారు.. బాగున్నారా.. అంటూ పలకరిస్తున్నారు.. ఒక వృద్ధురాలి దగ్గరికి వచ్చేసరికి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి ఒక్క క్షణం ఆగారు. గుర్తుపట్టి ‘బాగున్నారా.. శ్యామల గారూ!’ అంటూ నమస్కరించారు. ఇదీ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం, హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో గురువారం కనిపించిన సన్నివేశం.

హైద‌రాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) న్యూ ఇయర్‌ వేడుకలకు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఆర్కే ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం, హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నవారిని సజ్జనర్‌ పరామర్శించడంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరంగా న్యూ ఇయర్‌ డే వేడుకలు నిర్వహించారు. ఆశ్రయం పొందుతున్న 48 మందికి స్థానిక అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామలను (Pavala Shyamala) నెలరోజుల క్రితం తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్‌.. మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీ రమేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మిగిలినవారూ రమేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఆర్కే ఫౌండేషన్‌ ద్వారా 18 ఏళ్లుగా దాదాపు 15 వేల మంది వృద్ధులకు ఆశ్రయంతోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ రామకృష్ణ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని ఈతరానికి సూచించారు. కార్యక్రమంలో నార్త్‌ జోన్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌, కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: 'గుండెల‌కు హ‌త్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు'  

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)