Breaking News

యూ బెగ్గర్‌ అంటూ.. తాత అవమానించాడు

Published on Tue, 02/18/2025 - 10:48

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్‌ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది.  కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు. 

ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్‌ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.

ప్రతీరోజూ తనను బెగ్గర్‌ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్‌ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్‌ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్‌ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్‌ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.

హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్‌మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.

ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)