Breaking News

ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లు

Published on Sat, 09/14/2024 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంతో పాటు హోంగార్డ్స్‌ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్‌ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం 
వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్‌జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్‌ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్‌ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్‌ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)