Breaking News

వా.. నర ప్రేమ!

Published on Fri, 06/13/2025 - 11:17

విశ్వాసం గురించి చెప్పాల్సి వస్తే కుక్కనో, మరేయితర జంతువునో ప్రస్తావన తీసుకొస్తాం. ఎందుకంటే.. పట్టెడన్నం పెడితే మూగ జీవాలు చూపించే ప్రేమ అలాంటిది మరి!. తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ ఘటన.. పలువురిని కంటతడి పెట్టిస్తోంది. 

వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళ.. తన ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ గుడి వద్ద రోజూ సేవ చేస్తూ ఉండేది. ఆమె కొడుకు బొల్లె వీర్రాజు తల్లికి సాయంగా ప్రసాదం తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ వానరం వీర్రాజు దృష్టిని ఆకర్షించింది. అలా క్రమం తప్పకుండా ఆ వానరానికి ప్రసాదం పెట్టడంతో వాళ్లు మంచి స్నేహితులయ్యారు. అయితే అంతలోనే.. 

విధి వక్రీకరించింది. అనారోగ్యంతో వీర్రాజు మొన్నీమధ్యే కన్నుమూశాడు. రోజూ తనకు తిండి పెట్టి అపురూపంగా చూసుకునే వీర్రాజు రాకపోవడంతో.. ఆ వానరమే కదిలి వచ్చింది. ఇంట్లో విగత జీవిగా చాపలో ఉన్న వీర్రాజు చుట్టూ తిరిగింది. పాపం.. అతన్ని శాశ్వత నిద్ర నుంచి లేపేందుకు తన వంతు ప్రయత్నం చేసింది. అవేవీ జరగకపోవడంతో చివరకు తన స్నేహితుడి చెంత కాసేపు విశ్రమించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. 

వీర్రాజు అంతిమ యాత్రలోనూ కాసేపు ఆ వానరం కనిపించింది. గుడి దగ్గరకు రాగానే వీర్రాజు పార్థివదేహం మీద పడి విలపించినంత పని చేసింది. కొద్ది దూరం అంతిమ యాత్రలో జనాలతో కలిసి వచ్చి.. ఆపై వెనక్కి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించాయి. ఆ వా‘నర’ ప్రేమను కొందరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 

Monkey

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)