Breaking News

సిటీ చూసొద్దామని బయలుదేరి.. మృత్యుఒడికి..

Published on Sat, 12/28/2024 - 07:51

మాదాపూర్‌: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్‌ ఇన్స్‌పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఆకాం„Š  (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 

గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్‌ సైకిల్‌ (టీఎస్‌ 02 ఎఫ్‌ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్‌నగర్‌ సిగ్నల్‌ దాటిన తరువాత ఆకాంక్షా   నడుపుతున్న బైక్‌ అదుపుతప్పి రోడ్‌ డివైడర్‌ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)