Breaking News

వచ్చే నెలలో వివాహం.. అంతలోనే విషాదం

Published on Wed, 02/26/2025 - 12:55

కీసర: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం రాత్రి యాద్గార్‌పల్లి ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులో జరిగింది. మృతుల్లో తమ్ముడికి వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. అంతలోనే రోడ్డు ప్రమాదం అతడిని బలిగొనడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీసర సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి–భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్‌గూడకు చెందిన గూడూరు చంద్రశేఖర్‌ (36) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తార్నాక ప్రాంతంలో టైలర్‌గా పని చేస్తున్నాడు.

లాలాపేట శాంతినగర్‌లో ఉండే అతని సోదరుడు మత్స్యగిరి (27) విజయ డెయిరీలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సోమవారం తమ అల్లుడు శ్రీను (17)తోకలిసి సోమవారం యాద్గార్‌పల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇదే రోజు రాత్రి తిరిగి నగరానికి వెళ్తుండగా యాద్గార్‌పల్లి– చీర్యాల ఓఆర్‌ఆర్‌ సర్వీస్ రోడ్డులో ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలతో చంద్రశేఖర్‌ ఘటనా స్థలంలోనే  మృతి చెందాడు. మత్స్యగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. 

 చంద్రశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో    కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)