Breaking News

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో..

Published on Tue, 01/13/2026 - 11:47

హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్‌ జిల్లా చైర్మన్‌ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు.  

  • మల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2).  తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన  తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. 

  • ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్‌రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు.  స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.  స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్‌ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌లో అప్పగించారు.  

  • ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్‌ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు.   

  • ప్రజల్లో అవగాహన పెరగాలి  
    చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి. 
    – బాల భాస్కర్, మేడ్చల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి   

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)