Breaking News

20 రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే మృత్యు ఒడికి

Published on Tue, 02/03/2026 - 11:38

రంగారెడ్డి జిల్లా: కూతురి పెళ్లి ఘనంగా చేసి మురిసిపోదాం అనుకున్న ఆ తండ్రి కల చెదిరిపోయింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడుపల్లి గ్రామానికి చెందిన రవీందర్‌గౌడ్‌ (42) ప్రైవేటు ఉద్యోగి. భార్య లలిత, కూతురు ఉంది. కొడుకు ఏడాదిన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

ప్రస్తుతం వీరు పటాన్‌చెరు మండలం ముత్తంగిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే రవీందర్‌గౌడ్‌ కూతురి వివాహం నిశ్చయం కాగా.. ఈనెల 22న పెళ్లి ఉంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కూతురి వివాహ పనుల నిమితం తన ద్విచక్రవాహనంపై సిమెంటు బస్తా వేసుకొని సొంత గ్రామానికి బయలుదేరాడు. బైక్‌ ఎర్వగూడ గేటు వద్ద ఉండగా.. ఎదురుగా వికారాబాద్‌ వైపు నుంచి వస్తున్న కారు అతివేగం, అజాగ్రత్తగా వచ్చి బలంగా ఢీ కొట్టింది.

 ఈ ప్రమాదంలో రవీందర్‌ గౌడ్‌ తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల్లో పెళ్లి ఉందనగా ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)