Breaking News

కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై రేవంత్‌రెడ్డి కౌంటర్‌

Published on Sat, 04/08/2023 - 18:14

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా నోటీసులకు నోటీసులతోనే కౌంటర్‌ ఇచ్చారు. తనకిచ్చిన లీగల్‌ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఆసమయంలో ఆయన దేశంలో లేనందున ఆ బాధ తెలియదని అన్నారు.

టీఎస్‌పీఎస్‌సీకి టెక్నికల్‌ సపోర్ట్‌ అంతా ఐటీశాఖ అందిస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్‌ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌ రెడ్డి నియామకం కూడా ఐటీశాఖ ద్వారానే జరిగిందన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని చెప్పారు. పేపర్‌ లీకేజీపై హైకోర్టులో పిటిషన్‌ వేశామని.. ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. 

కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ రేవంత్ రెడ్డికి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
చదవండి: బండి సంజయ్ చొరవ.. బీజేపీ కార్యాలయ సిబ్బందిని కలిసిన మోదీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)