టపాసుల కాలుష్యంలో టాప్‌ ఫైవ్‌

Published on Wed, 11/06/2024 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని మహానగరాల్లో కాలుష్య మేఘాలు మరింత చిక్కబడుతున్నాయి. సాధారణ సమయంలో కూడా వాయు కాలుష్యం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక పటాకుల పండుగ దీపావళి రోజు వాయు కాలుష్యం అన్ని హద్దులు దాటుతోంది. గత నెల 31న దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. కానీ ఆరోజు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) సర్వేలో తేలింది.  

మొదటి స్థానం ఢిల్లీదే 
దీపావళి రోజు నమోదైన వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్‌ నగరం బెంగళూరుతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. దీపావళి రోజు 24 గంటల్లో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య వివరాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసింది. పండుగ రోజు అత్యధిక కాలుష్యం ఉన్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దీపావళి రోజు గ్రీన్‌ కాకర్స్‌ మినహా సాధారణ పటాకులు కాల్చటంపై నిషేధం ఉన్నా ఢిల్లీ మొదటి స్థానంలోనే నిలవటం గమనార్హం.

దీపావళి రోజు ఢిల్లీలో ఏక్యూఐ 339 పాయింట్లుగా నమోదైంది. స్విస్‌ కంపెనీ ఐక్యూ ఏఐఆర్‌ ‘లైవ్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సిటీస్‌ ఆన్‌ ఏక్యూఐ’నివేదిక ప్రకారం దీపావళి పండుగ మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను విశ్లేషించినపుడు ఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది.  

ఐక్యూ ఏఐఆర్‌ నివేదిక ప్రకారం
» పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం 2.5) ప్రామాణిక పాయింట్లపరంగా 30 పాయింట్లు దాటితే కాలుష్యకారకంగా పరిగణిస్తారు. 
» మనదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య స్థాయిలు జాతీయ సగటు కంటే రెండింతలు నమోదయ్యాయి. 
»  పీఎం 2.5 (అతి సూక్ష్మస్థాయిలోని ధూళి క ణాలు–పీఎం 2.5) విషయానికొస్తే జాతీయ సగటు కంటే ఢిల్లీలో 2022లో 92.6 పాయింట్లు అధికంగా ఉండగా, 2023లో 102.1 పాయింట్లు అధికంగా నమోదైంది. జాతీయసగటు 2022లో 53.3 పాయింట్లు, 2023లో 54.4 పాయింట్లు మాత్రమే ఉన్నది. 
» పీఎం 2.5 2022లో ముంబైలో 46.7 పాయింట్లు, 2023లో 43.8 పాయింట్లు నమోదైంది. 
» కోల్‌కతాలో 2022లో 50.2, 2023లో 47.8 పాయింట్లు రికార్డయ్యింది.  
»  హైదరాబాద్‌లో 2022లో 42.4 పీఎం 2.5 పాయింట్లు, 2023లో 39.9 పాయింట్లు నమోదైంది.  
» ప్రామాణికంగా చూస్తే పీఎం 10 స్థాయిలు (మైక్రోగ్రామ్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌) 60 పాయింట్లు దాటితే వాయు కాలుష్యకారకాలు పెరిగినట్టుగా భావించాలి. 2023–24 నాటికి ఏడాదికి 20 నుంచి 30 శాతం పీఎం 10 సాంద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్దేశించుకొన్నది. ఐతే సగటు వార్షిక పీఎం 10 స్థాయిలు 2023–24లో ఢిల్లీలో 208, ముంబైలో 94, కోల్‌కతాలో 94, అహ్మదాబాద్‌లో 98, పుణేలో 98, బెంగళూరులో 70, హైదరాబాద్‌లో 81, చెన్నైలో 63 పాయింట్లు రికార్డయ్యింది. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)