ఘోర ప్రమాదం.. లిఫ్ట్‌ తెగిపడి ముగ్గురి మృతి

Published on Wed, 05/07/2025 - 21:24

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్‌ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్‌ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్‌ ఒక్కసారిగా కూలిపోయింది. మృతులను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేష్‌ సర్కార్‌ (21), ప్రకాశ్‌ మండల్‌ (24), అమిత్రాయ్‌ (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గత నెల సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ (39) అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. కాగా, మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)