కేసీఆర్‌ గీసిన గీత దాటను 

Published on Wed, 08/23/2023 - 03:27

స్టేషన్‌ఘన్‌పూర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్‌ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య  భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు.

తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్‌పూర్‌ టికెట్‌ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)