Breaking News

వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు

Published on Sun, 06/29/2025 - 11:56

ధర్మసాగర్‌: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి క్షమాదేశ్‌ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. 

అశ్లీల వీడియోలు షేర్‌ చేయడం నేరం 
ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ధర్మసాగర్‌ పోలీసు స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్‌ను షేర్‌ చేస్తే సెక్షన్‌ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు.

  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)