Breaking News

కాంగ్రెస్‌ మెరుపు ధర్నా.. పటాన్‌చెరులో ఉద్రిక్తతలు

Published on Thu, 01/23/2025 - 12:26

సంగారెడ్డి, సాక్షి: పటాన్‌చెరులో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని పాత కాంగ్రెస్ క్యాడర్ గురువారం నిరసనకు పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో కాట వర్గీయులు మహిపా‌ల్‌ దిష్టిబొమ్మను తగలబెట్టాలని చూశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు తీవ్రవాగ్వాదంతో తోపులాట జరిగింది.

నిరసనగా.. సీఎం చిత్రపటంతో కొందరు కార్యకర్తలు పోలీసులను దాటుకుని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చేరుకున్నారు. ఆఫీస్‌ను ముట్టడించి.. లోపల సీఎం ఫొటో ఉంచారు.  ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉద్రిక్తతల నడుమ.. పటాన్‌చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

గత కొంతకాలంగా పటాన్‌చెరు కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మద్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ పంచాయితీని సర్దుబాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే రానురాను ఆ పరిస్థితులు మరింత ముదిరాయి. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ క్రమంలో..బొల్లారంలో ఓ కార్యక్రమానికి హాజరైన గూడెం పాత వర్గాన్ని బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో సేవ్ కాంగ్రెస్  .. సేవ్ పటాన్‌చెరు స్లోగన్‌తో కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఇవాళ కాంగగ్రెస్‌ నేతలు మెరుపు ధర్నాకు దిగడం.. పోలీసుల జోక్యం టెన్షన్‌ వాతావరణం నెలకొంది.


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)