Breaking News

మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు: డీజీపీకి మహిళా కమిషన్‌ ఆదేశాలు

Published on Thu, 11/20/2025 - 17:35

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ వేధింపులు, బెదిరింపులపై మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదుపై తెలంగాణ‌ మహిళా కమిషన్‌ స్పందించింది. తక్షణమే డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని తెలంగాణ DGPకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు  తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కమిషన్‌ చైర్ పర్సన్ నేరెళ్ల శారద  తక్షణమే స్పందించిన తీరుపై  మహిళా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. 

మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణను కాపాడటం తమ ప్రాధాన్యత అని నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్ హరాస్‌మెంట్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై సమన్స్ జారీ చేశామన్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ ఎల్లప్పుడూ ముందుండి కఠిన చర్యలు తీసుకుంటుంది ఆమె వెల్లడించారు. మహిళలపై ఇలాంటి దాడులు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని కూడా ఆమె హెచ్చరించారు. కాగా ఆన్‌లైన్‌ వేధింపులపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నవంబర్ 18న హైదరాబాద్‌ మహిళా జర్నలిస్టు బృందం మహిళా క మిషన్‌కు  ఫిర్యాదు చేసింది. 

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)