Breaking News

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

Published on Wed, 05/21/2025 - 14:18

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి, బంజారాహిల్స్‌, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, కార్వాన్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చాదర్‌ ఘాట్‌, మారేడుపల్లి, షేక్‌పేట్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, అత్తాపూర్‌, అంబర్‌పేట్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం,  ఉప్పల్‌, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.

ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్‌ అలర్ట్‌’ జారీ చేసింది.

ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్‌పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. 

రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.

ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు  జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. 

తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. 


సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.

హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. 

ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)