Breaking News

తెలంగాణ: నామినేషన్లు షురూ.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన

Published on Thu, 10/09/2025 - 12:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవాళ రిలీజ్‌ అయ్యింది.  మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.

జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్‌ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్‌ వేయాలనుకున్న జనరల్‌ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్‌ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్‌ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్‌ వేసే జనరల్‌ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్‌ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్‌ చేయాలి.

ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.

అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది.  15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.

ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)