Breaking News

సచివాలయ ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Published on Thu, 01/01/2026 - 18:04

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యోగుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కొత్త ఐడి కార్డులను ప్రవేశపెట్టింది. 

గత కొద్ది నెలలుగా సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో నకిలీ ఉద్యోగులను అరికట్టేందుకు కొత్త ఐడీ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. కార్డులపై సెక్రటేరియట్‌ భవనం,తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాలను ముద్రించింది. అదనంగా క్యూ ఆర్ కోడ్, ఇంటర్నల్ చిప్, ఎంప్లాయి నెంబర్, ఫోటో వంటి వివరాలను చేర్చింది. 

రెగ్యులర్ ఉద్యోగులు 1300 మంది, క్లాస్-4 ఉద్యోగులు 300 మంది.. మొత్తం 1600 మందికి ఈ కొత్త ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఐడి కార్డుల ద్వారా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. మార్ఫింగ్ లేదా నకిలీ కార్డులు తయారు చేసే అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల గుర్తింపును సాంకేతిక ఆధారాలతో నిర్ధారించే ప్రయత్నం జరుగుతోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)